న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1 నుంచి మూడు నెలల పాటు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు కొనసాగనున్నాయని తెలిపింది. దీంతో చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను ముట్టుకోకపోవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. దీంతో సుకన్య సమృద్ధి పథకం కింద వడ్డీరేటు 8.2 శాతంగాను, అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం, పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్ స్కీంపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.