హైదరాబాద్, జూన్ 19: హైదరాబాద్లో మరో అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్బ్లాక్స్ రియల్టీలు సంయుక్తంగా ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ పేరుతో అతి పొడువైన ప్రాజెక్టును నిర్మిస్తున్నది.
63 అంతస్తుల మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్టును రూ.3,169 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్నట్టు జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్బ్లాక్స్ ఇన్ఫ్రా భాగస్వామి లక్ష్మీ నారాయణ తెలిపారు. 7.34 ఎకరాల స్థలంలో ఈ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 2,560 చ.అ. నుంచి 4,825 చ.అ. విస్తీర్ణంలో 3బీహెచ్కే, 4 బీహెచ్కేలను నిర్మిస్తున్నట్టు చెప్పారు.