న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) వ్యవస్థాపకులకు బైజూస్ బ్రాండ్ పేరిట ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తున్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎల్పీఎల్) లీగల్ నోటీసులిచ్చింది. 2021లో ఏఈఎస్ఎల్ను టీఎల్పీఎల్ 940 మిలియన్ డాలర్ల క్యాష్-స్టాక్ డీల్లో భాగంగా కొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ షేర్ల మార్పిడికి సహకరించడం లేదంటూ ఏఈఎస్ఎల్ ఫౌండర్ చౌద్రీకి టీఎల్పీఎల్ ఈ నోటీసులిచ్చింది.