హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఫార్మా పరిశ్రమల రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రోత్సహించేందుకు తెలంగాణ సహా ఐదు రాష్ర్టాలను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఎంపికచేసింది. రాష్ట్రం నుంచి మెదక్ జిల్లాను ఎంపిక చేయగా, ఇతర రాష్ర్టాల నుంచి బడ్డి, మడగావ్, అహ్మదాబాద్, బీదర్ జిల్లాలను బీఈఈ ఎంపికచేసింది.
స్థిరమైన పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యుత్తుశాఖ, అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్(అదితి) పథకాన్ని కేంద్రం రూపొందించింది. ఈ పథకం కింద రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించింది.