న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా పన్నుల విషయానికొస్తే.. కార్పొరేషన్, వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ)ల్లో కోతలు పెట్టినా.. సంపద పన్ను రద్దు చేసినా ఫలితం శూన్యమేనన్న అభిప్రాయాలున్నా యి. ఎల్టీసీజీ, కొత్త ఐటీ చట్టానిదీ ఇంతే.
అన్నింటా తన వారికి, తన రాష్ర్టానికి పెద్దపీట వేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే చెల్లిందని చెప్పవచ్చు. గతంలో జరిగిన తన సౌదీ అరేబియా పర్యటనలో స్వరాష్ట్రం గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఆ దేశ సావరిన్ ఫండ్ పీఐఎఫ్ కార్యాలయం పెట్టేందుకు వీలుగా చట్టాన్నైతే సవరించేశారు మరి. డివిడెండ్, వడ్డీ, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుల నుంచి పీఐఎఫ్కు మినహాయింపు కల్పించడం విశేషం.
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014-15 నుంచి 2024-25 వరకు ఈ పదేండ్లలో దేశ జీడీపీ కంటే డిమాండ్లో వాస్తవిక వృద్ధిరేటు సగటు తక్కువగానే ఉంటున్నది. జీడీపీ 6.2 శాతంగా ఉంటే.. వినియోగం వృద్ధి 6.1 శాతంగానే ఉన్నది. తయారీ రంగానిదీ ఇంతే. ఇక పొదుపు విషయానికొస్తే..