ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వార్షిక వడ్డీరేటు ఆకర్షణీయంగా ఉన్నది. 8.25 శాతంగా అమలవుతున్నది. దీంతో నెలకు రూ.6,400 చొప్పున 35 ఏండ్లు చెల్లిస్తే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.1.52 కోట్లు అందుకోవచ్చు. అలాగే రూ.10,600తో రూ.2.51 కోట్లు పొందవచ్చు. అయితే రూ.12,500 చొప్పున 37 ఏండ్లు చెల్లిస్తే రిటైర్మెంట్ వయసులో రూ.3.5 కోట్లు తీసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల కోసం ఉన్న సురక్షిత ప్రభుత్వ పొదుపు పథకం. నెలనెలా వేతన జీవులు కొంత మొత్తాలను చెల్లిస్తే.. పదవీ విరమణ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో లభిస్తుంది. కాగా, ఈపీఎఫ్‌పై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్ణయిస్తూ ఉంటుంది. సాధారణంగా 58 ఏండ్లు దాటితేగానీ లబ్ధిదారునికి ఈపీఎఫ్‌వో పెన్షన్ రాదు. ముందస్తు పెన్షన్ కావాలంటే కనీసం 50 ఏైండ్లెనా దాటాలి. 58 ఏండ్లు దాటిన తర్వాత రెండేండ్లు వాయిదా వేసుకోవచ్చు. దానికి ఏటా 4 శాతం అదనపు వడ్డీరేటు లభిస్తుంది.