హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దండు మల్కాపూర్‌లోని టిఫ్ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఎన్వీరో ఫ్లూయిడ్స్ ఇండస్ట్రీని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఏర్పాటైన పరిశ్రమలను ఆమె సందర్శించి, ఇక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్కు అభివృద్ధి, భవిష్యత్ పారిశ్రామిక అవసరాల గురించి టిఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.