హైదరాబాద్, జూలై 13 : ప్రపంచంలో మూడో అతిపెద్ద క్వాలిటీ ఇంజినీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంపెనీ టెస్టింగ్ ఎక్స్పర్ట్.. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగం గా హైదరాబాద్‌లో సరికొత్త డెలివరీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తొలి విడతగా 300 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక కేంద్రం.. భవిష్యత్తులో 2,500 సీట్లకు పెంచుకునే అవకాశం ఉన్నదని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ గుప్తా తెలిపారు. భవిష్యత్తులో ఈ డెలివరీ సెంటర్‌ను ఇన్నోవేషన్ సెంటర్‌గా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ప్రతిభ కలిగినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలనిస్తామన్నారు.