Elon Musk | ఎలన్‌మస్క్.. గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో. ఆయన సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఫుల్‌టైం ఇన్ఫ్ల్యూయన్సర్గా ప్రస్తుతం తాను నిర్వర్తిస్తున్న విధుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మస్క్.. తన బాధ్యతల నుంచి వైదొలగాలని ఆయన సీరియస్‌గానే భావిస్తున్నారా.. లేదా.. అన్న సంగతి తెలియ రాలేదు.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్.. అంతరిక్ష పరిశోధనల కోసం స్పేస్ ఎక్స్ అనే రాకెట్ కంపెనీని స్థాపించి, దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్ బోరింగ్ కంపెనీకి సారధ్యం వహిస్తున్నారు. గత జనవరిలో జరిగిన ఓ సదస్సులో ఎలన్ మస్క్ మాట్లాడుతూ..ఏండ్ల తరబడి టెస్లా సీఈవోగా కొనసాగుతానని భావిస్తున్నట్లు చెప్పారు.
రాత్రింబవళ్లు పని చేయడానికి బదులు నా చేతులకు కొంత టైం స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తున్నా. ఒక వారంపాటు హాయిగా నిద్రపోదామనుకున్నా నన్ను నిద్ర లేపేస్తారు. ఇది చాలా తీవ్రమైన అంశం అని మన్క్ వ్యాఖ్యానించారు. టెస్లా సంస్థలో తన 10 శాతం వాటాల విక్రయించిన ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.