Tesla – Elon Musk | ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. అక్కడ టెస్లా కార్లపై భారీ డిస్కౌంట్లు !
Tesla - Elon Musk | అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. చైనాలో అన్ని రకాల మోడల్ కార్ల ధరలు సుమారు 2000 డాలర్ల మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ఇంతకుముందు అమెరికాలోనూ కార్ల ధరలు తగ్గించిన ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా.. తాజాగా చైనాలోనూ ధరలు తగ్గించింది. టెస్లా కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన `మోడల్3 కారు ధర 14 వేల చైనా యువాన్లు (1930 అమెరికా డాలర్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Tesla – Elon Musk : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. చైనాలో అన్ని రకాల మోడల్ కార్ల ధరలు సుమారు 2000 డాలర్ల మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ఇంతకుముందు అమెరికాలోనూ కార్ల ధరలు తగ్గించిన ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా.. తాజాగా చైనాలోనూ ధరలు తగ్గించింది. టెస్లా కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన `మోడల్3 కారు ధర 14 వేల చైనా యువాన్లు (1930 అమెరికా డాలర్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా మోడల్ 3 కారు ధర 2,31,900 యువాన్లకు తగ్గించినట్లు చైనా టెస్లా వెబ్సైట్ పేర్కొంది. అమెరికా డాలర్లతో పోలిస్తే 32 వేల డాలర్లు.
అలాగే టెస్లా మోడల్ వై కారు ధర 2,49,900 చైనా యువాన్లు, రెగ్యులర్ వర్షన్ మోడల్ ఎస్ 6,84,900 చైనా యువాన్లు, మోడల్ ఎస్ 8,14,900 చైనా యువాన్లు మోడల్ ఎక్స్ 8,24,900 నుంచి 7,24,900 యువాన్లకు తగ్గించింది. అమెరికాలోనూ మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ కార్ల ధరలు 2000 డాలర్లు తగ్గింది. ఇక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ధర 8000 డాలర్ల నుంచి 12 వేల డాలర్లకు తగ్గించారు. 2024 తొలి త్రైమాసికంలో గ్లోబల్ మార్కెట్లో టెస్లా కార్ల విక్రయాలు పడిపోయాయి. గత నాలుగేండ్లలో ఒక త్రైమాసికంలో కార్ల విక్రయాలు పడిపోవడం ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ చైనాలో టెస్లా తన కార్ల ధరలు తగ్గించడానికి ప్రాధాన్యం ఏర్పడింది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 10 శాతం సిబ్బందిని తగ్గిస్తామని గత సోమవారం ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు. కార్ల విక్రయాలను పెంచుకోవడానికి లాభాలు తగ్గించుకోవడానికి కూడా ఎలాన్ మస్క్ వెనుకాడటం లేదు. ధరల తగ్గింపు వల్ల పలు దఫాలు టెస్లా కార్ల షేర్ పతనమైంది. ఈ ఏడాది 40.8 శాతం మేరకు టెస్లా షేర్ నష్టపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

