న్యూయార్క్, జనవరి 26: కస్టమర్లకు షాకిచ్చింది టెస్లా సంస్థ. సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తడంతో వెనకవైపువున్న కెమెరా డార్క్ మోడ్‌లోకి పోనుండటంతో అమెరికాలో 2 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిలో 2023 ఏడాదికి సంబంధించి మాడల్స్ వై, ఎస్, ఎక్స్‌లు ఉన్నాయి. పూర్తిస్థాయి సెల్ఫ్-డ్రైవింగ్ కంప్యూటర్ 4.0, సాఫ్ట్వేర్ వెర్షన్ 2023.44.30, 2023.44.30.6 లేదా 2023.44.100లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వెల్లడించింది. ఈ సమస్యతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రమాదాలు జరగలేదని, అయినప్పటికీ ఈ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది.