న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఇప్పటికే ప్రయత్నాలు వేగవంతం చేసిన అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా..తాజాగా ఉద్యోగ నియామకాలను ప్రారంభించింది. అతి త్వరలో తన తొలి షోరూంను ప్రారంభించబోతున్న సంస్థ అందుకుతగ్గట్టుగా రిక్రూట్మెంట్లను ఆరంభించింది. తన తొలి షోరూంను ముంబైలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తున్నది. నూతన ఉద్యోగాల్లో సర్వీస్ అడ్వయిజర్లు, సర్వీస్ మేనేజర్లు, స్టోర్ మేనేజర్లు ఉన్నారు.