Tesla Self Driving Best | పూర్తిగా అటానమస్ వెహికిల్‌గా.. సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా అత్యధిక కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొన్నది ఆ కారు.. అదే గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా.. ఈ సంస్థ సీఈవో ఎలన్‌మస్క్. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు సెల్ఫ్ డ్రైవింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయని 32 శాతం మంది కస్టమర్లు పేర్కొన్నారు. న్యూ ఆటోపసిఫిక్ రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా 56 కార్ల పనితీరుపై నిర్వహించిన అద్యయనంలో ఈ సంగతి తేలింది.
టయోటా కార్లు సెల్ఫ్ డ్రైవిగ్కు అనుకూలమని 19 శాతం మంది, బీఎండబ్ల్యూ కార్లు 18 శాతం మంది కస్టమర్లు చెప్పారు. పూర్తిగా అటానమస్ వెహికల్స్‌లో అత్యంత విశ్వసనీయమైన, సేఫ్, నమ్మదగిన కారుగా టెస్లా నిలిచిందని ఈ అధ్యయనంలో తేలింది. ఒకవేళ మీరు టెస్లా కారు కొనుగోలు చేస్తే అదనంగా 12 వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధ పడాల్సిందే. అప్పుడు టెస్లా నుంచి మీరు పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కారును పొందొచ్చు. అయితే సిస్టం పూర్తిగా అటానమస్ కాదని, డ్రైవర్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
డ్రైవర్ సేఫ్టీ స్కోర్‌ను ఖరారు చేసేందుకు టెస్లా బీటా ప్రోగ్రాం నిర్వహిస్తుంది. సదరు డ్రైవర్ వ్యవహారశైలిని బట్టి డ్రైవర్ సేఫ్టీ స్కోర్ ఖరారవుతుంది. ఇప్పటివరకు టెస్లా బీటా ప్రోగ్రామ్‌లో 60 వేల మందికి పైగా ఉన్నారు. కెనడాలోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఎలన్‌మస్క్ తెలిపారు.