హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కాలుష్యమయ జీవితానికి దూరంగా.. నగరానికి దగ్గర్లో అన్ని సౌకర్యాలతోకూడిన ఇల్లుంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తున్నారా?.. ప్రకృతి మధ్యలో విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటున్నారా?.. అయితే మీ కోసమే తుక్కుగూడ (శంషాబాద్)లో ఆలయ్ ఇన్ఫ్రా ‘రోలింగ్ మెడోస్’ విల్లా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటిదాకా ఉన్న విల్లా ప్రాజెక్టులకు భిన్నంగా ఆధునిక డిజైన్‌తో ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్‌కు గేటెడ్ కమ్యూనిటీతో ఆలయ్ ఇన్ఫ్రా నాంది పలికింది. అందంగా ఇంటిని డిజైన్ చేసే ఓ ఆర్కిటెక్ట్.. బిల్డర్‌గా మారి ప్రాజెక్టు చేపడితే దాని ప్రత్యేకతే వేరు. 20 ఏండ్ల ఆర్కిటెక్ట్ అనుభవంతో బిల్డర్‌గా తొలి ప్రయత్నం చేస్తున్న ఆలయ్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్ నిరూప్‌రెడ్డి హైదరాబాద్ రియల్టీ రంగంపై ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారి మాటల్లోనే..
హైదరాబాద్ ఈజ్ ఎవర్గ్రీన్
సుస్థిర పాలన, సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ విశేష కృషి ఫలితంగా హైదరాబాద్‌పై కంపెనీలకు విశ్వాసం పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు క్యూ కడుతున్నాయి. అన్ని రంగాలతోపాటు నిర్మాణ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. దక్షిణాదిన చెన్నై, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతున్నది. కరోనా సమయంలోనూ ఇక్కడి మార్కెట్లో వృద్ధిరేటు కొనసాగింది. ఇక్కడ ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన చాలామంది ఇండ్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడి నిమిత్తం స్థానికులతోపాటు ప్రవాసుల కొనుగోళ్లూ పెరిగాయి. ఇక బిల్డర్లు ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్ పేరుతో అనుమతుల విధానాన్ని సరళీకృతం చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే స్థానిక రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వృద్ధిపథంలో ఉంటుందని చెప్పవచ్చు.
కూల్ రూఫ్ పాలసీ భేష్
కూల్ రూఫ్ పాలసీ హర్షణీయం. 2030 నాటికి 300 చదరపు కిలోమీటర్ల ఏరియాలో కూల్ రూఫింగ్ పాలసీని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దీనిపై ఆయా శాఖలు విస్తృతంగా అవగాహన కల్పిస్తుండటం బాగున్నది. అయితే బిల్డింగ్ ప్లానింగ్ స్టేజీలోనే ప్లాన్ చేసుకుంటే కూల్ రూఫింగ్ ఖర్చు 1-2 శాతానికి మించి పెరగదు.
–నిరూప్‌రెడ్డి,ఆలయ్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్
రోలింగ్ మెడోస్ ప్రత్యేకతలు