హైదరాబాద్, అక్టోబర్ 16: బెల్జీయంకు చెందిన హోమ్ ఆటోమేషన్ సంస్థ టెలిటాస్క్..హైదరాబాద్‌లో తన ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీతోపాటు ఆఫీస్ భవనాలు, హై-రేజ్ అపార్ట్మెంట్లకు అవసరమైన లైటింగ్, మోటోరైజ్డ్ కర్టెన్లు, పవర్ సాకెట్స్, ఆడియో, సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ సీఈవో కళ్యాణరామన్ తెలిపారు. వచ్చే ఏడాదిలోగా తన వ్యాపారాన్ని 25 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు.
క్యూ2లో బజాజ్ ఆటో ప్రాఫిట్ డౌన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 31 శాతం తగ్గి రూ.1,385 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇది రూ.2,020 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.13,247 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది.