ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణను చేర్చండి
సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
- ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026 కర్టెన్ రైజర్‌లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026 కర్టెన్ రైజర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర డిఫెన్స్ ఎగుమతులు గతంతో పోలిస్తే 103 శాతం పెరిగాయని, రాష్ట్రంలో డాటా సెంటర్ల సామర్థ్యాన్ని 2030 నాటికి 5 గిగావాట్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని వివరించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే సంకల్పంతోనే గతేడాది తెలంగాణ రైజింగ్ విజన్‌కు శ్రీకారం చుట్టామని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా అమలు చేస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించి పారిశ్రామికవేత్తలను రైజింగ్ తెలంగాణ విజన్‌లో భాగస్వామ్యం చేసేందుకే ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026 కర్టెన్ రైజర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ 2.0 లో పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలను కోరారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

