హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ అధికారి అజిత్ రంగ్నేకర్ ఒక ప్రకటనలో సూచించారు.
ప్రతియేటా నిర్వహించే ఈ కార్యక్రమం 6వ విడతను నిర్వహించేందుకు టీఎస్ఐసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నదని, 33 జిల్లాల్లో 3 వేలకు పైగా గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయి ఆవిష్కరణలను గుర్తించడంతోపాటు వాటిని ప్రాజెక్టులుగా రూపొందించేలా ప్రోత్సహిస్తామన్నారు. తమ ఆవిష్కరణలను ఆగస్టు 3లోగా 9109678543కి వాట్సప్ చేయాలని ఆయన సూచించారు.