ముంబై, ఏప్రిల్ 25 : ఇప్పటికే పలు ప్రత్యేకతలు సాధించిన హైదరాబాద్.. వివిధ రవాణా సదుపాయాలకు, డెలివరీలకు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సైతం టాప్‌లో నిలిచింది. అధిక శాతం మంది క్యాష్‌లెస్ మొబిలిటీ, డెలివరీ సర్వీసుల కోసం మూడు అంతకంటే ఎక్కువ అప్లికేషన్లను వాడుతున్న మెగా నగరాల్లో హైదరాబాద్ తర్వాతి స్థానంలో కోల్‌కాతా ఉందని మంగళవారం విడుదలైన ఒక రిపోర్ట్ వెల్లడించింది.
సూరత్ తృతీయ స్థానంలో ఉంది. ప్రామిసింగ్ నగరాల్లో క్యాష్‌లెస్ మొబిలిటీ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్న నగరం మిజోరం రాజధాని ఐజ్వాల్ కాగా, బూమింగ్ నగరాల్లో కాన్పూర్, రైజింగ్ సిటీస్‌లో లూధియానాలు నిలిచినట్టు ఓఎంఐ ఫౌండేషన్ ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ ఇండియా 2022 నివేదిక తెలిపింది. దేశంలోని 18 నగరాల్లో 50 వేలకుపైగా ప్రజల స్పందనను అనుసరించి నివేదిక రూపొందించారు. రిపోర్ట్ వివరాలు…
కొచ్ఛిలో మొబిలిటీ సర్వీసులను షేర్ చేసుకోవడం ఎక్కువ. అయితే మొబిలిటీకి డిజిటల్ చెల్లింపుల్లో ఈ నగరం వెనుకపడి ఉంది
వివిధ వాహనాల్లోకి మారుతూ రవాణా సాగించే సీమ్‌లెస్ మొబిలిటీ అనుభవాన్ని అందించడంలో భువనేశ్వర్ ముందుంది
ఈవీలపై అహ్మదాబాద్‌లో మోజెక్కువ
ప్రజా రవాణాను మహిళలు అధికంగా ఉపయోగించుకునే నగరం లూధియానా
క్లీన్ మొబిలిటీ వినియోగంలో ఐజ్వాల్ టాప్
రవాణాకు తక్కువ ఖర్చుచేసే నగరం జబల్పూర్
మూడు కంటే డెలివరీ అప్లికేషన్లను అధికశాతం మంది ఉపయోగించే నగరం పనాజి