Tecno Spark 30C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో స్పార్క్ 30సీ (Tecno Spark 30C) ఫోన్లో కొత్త ర్యామ్ ప్లస్ వేరియంట్‌ను సోమవారం ఆవిష్కరించింది. తాజాగా 8జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ మంగళవారం నుంచి అందుబాటులో ఉంటుంది. టెక్నో స్పార్క్ 30సీ (Tecno Spark 30C) ఫోన్ ఆవిష్కరించిన నాలుగు నెలల తర్వాత కొత్త వేరియంట్ తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్ 30సీ (Tecno Spark 30C) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) ప్రాసెసర్, 48-మెగా పిక్సెల్ రేర్ కెమెరా యూనిట్, 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5,000ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
టెక్నో స్పార్క్ 30సీ (Tecno Spark 30C)ఫోన్ న్యూ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 12,999లకు లభిస్తుంది. ఈనెల 21 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ అరోరా క్లౌడ్ (Aurora Cloud), అజూర్ స్కై (Azure Sky), మిడ్నైట్ షాడో (Midnight Shadow) రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ రోజువారీగా రూ.44 చొప్పున 10 నెలల ఈఎంఐ ప్లాన్‌తో కొనుగోలు చేయొచ్చు.
టెక్నో స్పార్క్ 30సీ (Tecno Spark 30C)ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లతోపాటు న్యూ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. టెక్నో స్పార్క్ 30సీ (Tecno Spark 30C)ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,499 లకు లభిస్తుంది.
టెక్నో స్పార్క్ 30సీ 5జీ (Tecno Spark 30C 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 (Android 14) బేస్డ్ హెచ్ఐఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల హెచ్డీ (720 x 1,600 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. 128 జీబీ స్టోరేజీ కెపాసిటీని మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.
టెక్నో స్పార్క్ 30సీ 5జీ (Tecno Spark 30C 5G) ఫోన్ 48- మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 582 రేర్ కెమెరా సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంటుంది. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డోల్బీ ఆట్మోస్ సపోర్ట్‌తో వస్తోంది. ఆల్ డైరెక్షనల్ ఎన్ఎఫ్సీ, ఐఆర్ రిమోట్, ఐపీ 54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. టెక్నో స్పార్క్ 30సీ 5జీ ఫోన్ 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.