Tecno Spark 20 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ (Tecno Spark 20 Pro 5G) ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన టెక్నో.. భారత్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 10 5జీ బాండ్స్‌కు మద్దతుగా ఉండే ఈ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తోంది.
టక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.15,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999 పలుకుతుంది. ఈ ఫోన్ స్టార్ ట్రైల్ బ్లాక్, గ్లాసీ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 11 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఔట్లెట్లలో ఫోన్లు లభ్యం అవుతాయి. అన్ని బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, యూపీఐ, పేపర్ ఫైనాన్స్ పై కొనుగోలు చేసే వారికి ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద రూ.2000 క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్ చేసింది.
టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ (Tecno Spark 20 Pro 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2460×1080 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ (Tecno Spark 20 Pro 5G) ఫోన్.. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తోంది. 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 1440పీ విత్ 30ఎఫ్‌పీఎస్ వరకూ వీడియో రికార్డింగ్ కోసం ప్రైమరీ కెమెరా మద్దతుగా ఉంటుంది. టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ (Tecno Spark 20 Pro 5G) ఫోన్ 33వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ 10వాట్ల రివర్స్ చార్జింగ్ కు మద్దతుగా ఉంటుంది. 4జీ ఎల్టీఈ, 10 5జీ బాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది.
Vivo | వివో నుంచి మరో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
New EV Policy | కొత్త ఈవీ పాలసీ’లో మార్పులు.. దేశీయ కంపెనీలకే బెనిఫిట్లు.. ఎందుకంటే..?!
Tomato | మండే బ్లూస్ మాదిరిగా టమాటా కష్టాలు.. సెంచరీకి చేరువలో కిలో..!