Tecno Pova 6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) భారత్ మార్కెట్లోకి ఈ నెల 29న తన టెక్నో6 ప్రో 5జీ (Tecno Pova 6 Pro 5G) ఫోన్ ఆవిష్కరించనున్నది. గత నెలలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో టెక్నో పొవా 6ప్రో 5జీ (Tecno Pova 6 Pro 5G) ఫోన్‌ను తొలుత రిలీజ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ, 12 జీబీ ర్యామ్, 70 వాట్ల చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 108-మెగా పిక్సెల్స్ సెన్సర్ ప్రైమరీ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
టెక్నో పోవా6 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్‌తోపాటు 256 జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. ర్యామ్ కెపాసిటీని వర్చువల్‌గా 24 జీబీ ర్యామ్ వరకూ పొడిగించొచ్చు.
108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. డోల్బీ అట్మోస్ స్పాషియల్ సౌండ్, డైనమిక్ మినీ ఎల్ఈడీ లైటింగ్ ఆన్ రేర్ ప్యానెల్ ఉంటాయి. 70వాట్ల చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఇక గతేడాది ఆవిష్కరించిన టెక్నో పొవా 5ప్రో 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 పలికింది.