Tecno Phantom V Fold 2 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో ఫాంటం వీ ఫోల్డ్2 5జీ (Tecno Phantom V Fold 2 5G) ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత నెల 13న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్2 5జీ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఔటర్ 6.42 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ విత్ 1029×2550 పిక్సెల్స్ రిజొల్యూషన్, ఇన్ సైడ్ 7.85 అంగుళాల 2కే+ అమోలెడ్ డిస్ డిస్ ప్లే విత్ 2000×2296 పిక్సెల్స్ రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి.
మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో వస్తుందీ ఫోన్. 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ వేరియంట్ గా ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం రెండు 32-మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి. 70వాట్ల ఆల్ట్రా చార్జింగ్, 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5750 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, హాల్ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్కర్ సెన్సర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.