హైదరాబాద్, నవంబర్ 12 : ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్ట్రింగ్ మెటావర్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.137. 82 కోట్ల ఆదాయంపై రూ.12.13 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సంతోష్ అల్తురి మాట్లాడుతూ..కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్ కామర్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో వచ్చేమూడేండ్లకాలంలో 100 శాతం వరకు వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా టెక్నాలాజికల్ అడ్వాన్స్మెంట్స్, వ్యూహాత్మక భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు అంతర్జాతీయంగా 20 లక్షల మంది యాక్టివ్ గేమింగ్ యూజర్లు ఉన్నారు.