WhatsApp | అగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. వావ్ అనాల్సిందే మరి..!
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. తాజాగా యూజర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్ అగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫీచర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ విషయాన్ని వాట్సాప్‌ని ట్రాక్ చేసే వాబీఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఏఆర్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో పరీక్షిస్తుందని పేర్కొంది. వాట్సాప్ 2.24.13.14. బీటా వెర్షన్లో టెస్టింగ్ దశలో ఉందని వాబీ ఇన్ఫో పేర్కొంది.
ఏఆర్ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు వీడియో కాలింగ్ సమయంలో అనేక ఎఫెక్ట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. బీటా వెర్షన్లో ఏఆర్ ఎఫెక్ట్‌లను చూడగలిగే ఫీచర్ స్క్రీన్‌షాట్ సైతం కనిపించింది. ఏఆర్ ఎఫెక్ట్‌లతో యూజర్లు వీడియో కాల్ల సమయంలో డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్లను సైతం ఉపయోగించుకోవచ్చు. అప్డేట్ అందుబాటులోకి వచ్చాక అనేక రకాల లైట్ ఎఫెక్ట్లు సైతం అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఏఆర్ ఫీచర్‌తో పాటు వాట్సాప్ మరో ఫీచర్‌పై పని చేస్తుందని వాబీఇన్ఫో తెలిపింది. యూజర్లు వీడియో కాల్ల సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకునే ఫీచర్‌పై పని చేస్తుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

