న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశీయ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,353.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,166.7 కోట్ల కంటే ఇది 16 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.6 శాతం ఎగబాకి రూ.15,076 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషి మాట్లాడుతూ…ఏఐ ఆధారిత సంస్థగా తీర్చిదిద్దడానికి పరివర్తనను వేగవంతం చేశామని తెలియజేశారు.