Tax Savings | పన్ను ఆదా పెట్టుబడులు.. సీనియర్ సిటిజన్ల కోసం ఉన్న మార్గాలేవి?
ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ సేవింగ్స్ కీలకం. సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో పన్నులను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే సీనియర్ సిటిజన్లకు మరిన్ని అవకాశాలుంటాయి.
Tax Savings | ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ సేవింగ్స్ కీలకం. సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో పన్నులను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే సీనియర్ సిటిజన్లకు మరిన్ని అవకాశాలుంటాయి. వాటిలో..
ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలు
ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సి కింద ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ల్లో పెట్టుబడులకు పన్ను మినహాయింపున్నది. ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు. పైగా బ్యాంకుల్లో ఎఫ్డీలకు వృద్ధులకైతే అదనపు వడ్డీ కూడా ఉంటుంది. అలాగే నెల, 3 నెలలు, వార్షిక ప్రాతిపదికన నగదునూ పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
సీనియర్ సిటిజన్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఇదో సురక్షిత పెట్టుబడి మార్గం. పీపీఎఫ్ల్లో పెట్టుబడి ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదాకు అవకాశాన్నిస్తుంది. పీపీఎఫ్ ఖాతా పరిమితి 15 ఏండ్లు.
ట్యాక్స్ ఫ్రీ బాండ్లు
ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడి పెట్టేవారికి చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ రంగ కార్యక్రమాలు, ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున జారీ చేస్తాయి. కాబట్టి ఇదో భద్రత కలిగిన పెట్టుబడి సాధనం.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్)లు కూడా అద్భుతమైన పన్ను ప్రయోజనాలకు నెలవు. తక్కువ రిస్కుతో ఎక్కువ రాబడులను అందుకోవచ్చు. ఇక ఐటీ చట్టంలోని సెక్షన్ 80సి కింద ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే వీటిల్లో లాకిన్ పీరియడ్స్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- elss
- IT
- ppf
- senior citizens
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

