ఎయిర్ ఇండియా రేసులో టాటాలు

- ముగిసిన బిడ్డింగ్ ప్రక్రియ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటాలు పోటీపడుతున్నారు. ఎయిర్ ఇండియా కోసం బిడ్ దాఖలు చేసినట్లు టాటా సన్స్ అధికారప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపారు. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా కొనేందుకు ఆసక్తి చూపుతుండగా, దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఎయిర్ ఇండియాను కొనేందుకు పలు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని బుధవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా లావాదేవీ సలహాదారు ఆయా కంపెనీల నుంచి బిడ్లు అందుకున్నారు. ఇప్పుడిక ఈ ప్రక్రియ చివరి దశకు చేరింది’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను అమ్మేయాలని మోదీ సర్కారు చూస్తున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో మొదలైన ఈ అమ్మకం ప్రక్రియకు కరోనా పరిస్థితులు అడ్డుతగలగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. బుధవారంతో ఈ గడువు ముగిసిపోయింది. 2019 మార్చి 31 నాటికి ఎయిర్ ఇండియా రుణ భారం రూ.60,074 కోట్లుగా ఉన్నది. సంస్థను కొనేవారు రూ.23,286.5 కోట్లను మోయాల్సిందే. మిగతాది ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్‌కు బదిలీ అవుతుంది. 2007 నుంచి ఎయిర్ ఇండియా నష్టాల్లోనే నడుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

