Tata Technologies IPO | 19 ఏండ్ల తర్వాత టాటా సన్స్ నుంచి ఐపీవోకు మరో సంస్థ.. ఇవీ డిటైల్స్!
Tata Technologies IPO | టాటా సన్స్ 19 ఏండ్ల తర్వాత మరో సంస్థ టాటా టెక్నాలజీస్‌ను ఐపీవోకు తీసుకొస్తున్నది. 2004లో టీసీఎస్ తర్వాత ఐపీవోకు వస్తున్న టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ సంస్థ మొదటిది.
Tata Technologies IPO | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ త్వరలో దేశీయ స్టాక్మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ కానున్నది. ఈ మేరకు టాటా మోటార్స్‌కు అనుబంధంగా పని చేస్తున్న టాటా టెక్నాలజీస్ సంస్థ.. ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ Intial Public Offer (IPO) కు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఐపీవో కోసం ప్రాథమిక పత్రాలను అందజేసింది. టాటా టెక్నాలజీస్‌లో ప్రధాన వాటాదారులుగా ఉన్న టాటా మోటార్స్‌తోపాటు మరో రెండు సంస్థలు 23.6 శాతం వాటా విక్రయానికి సిద్ధమైనట్లు సమాచారం. గతంలో 2004లో ఐటీ జెయింట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మార్చింది టాటా సన్స్.. తాజాగా 19 ఏండ్ల తర్వాత మరో సంస్థ.. టాటా టెక్నాలజీస్‌ను ఐపీవోకు తెస్తున్నది.
టాటా టెక్నాలజీస్ ఐపీవో అసాంతం ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద జరుగనున్నది. టాటా మోటార్స్ 8,11,33,706, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 97,16,853, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 48,58,425 షేర్లను విక్రయించనున్నాయి. కానీ ఈ ఐపీవో ద్వారా టాటా టెక్నాలజీస్ సమీకరించనున్న నిధుల వివరాలు వెల్లడి కాలేదు. కానీ ఇటీవల నిర్వహించిన టాటా టెక్ షేర్ల బై బ్యాక్ ప్రకారం సంస్థ విలువ రూ.16,080 కోట్లుగా నిర్ధారించారు. అయితే, తాజా ఐపీవో ద్వారా రూ.3,800 కోట్ల నిధులను సమీకరించొచ్చునని తెలుస్తున్నది. ఈ ఐపీవోకు జేఎం ఫైనాన్సియల్ లిమిటెడ్, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా.. లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.
ఇంజినీరింగ్, డిజిటల్ సేవల సంస్థ.. టాటా టెక్నాలజీస్. ఇందులో ప్రస్తుతం 11వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్లతోపాటు టాటాసన్స్ అనుబంధ సంస్థలకు ఈ సంస్థ సేవలందిస్తున్నది. ఇందులో టాటా మోటార్స్, అల్పా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్లతోపాటు టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా ఎంటర్ప్రైజెస్ ఓవర్సీస్, జెడ్రా కార్పొరేట్ సర్వీసెస్, ప్యాట్రిక్ రేమాన్ మెక్గోల్డ్ రిక్ సంస్థలకు వాటాలు ఉన్నాయి. టాటా టెక్నాలజీ సంస్థ ఐపీవో వల్ల టాటా మోటార్స్‌కు లబ్ధి చేకూరుతుందా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

