Tata Nexon | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవలే పనోరమిక్ సన్ రూఫ్‌తో టాటా నెక్సాన్ సీఎన్జీ (Tata Nexon CNG) కారు ఆవిష్కరించింది. తాజాగా పనోరమిక్ సన్ రూఫ్‌తో టాటా నెక్సాన్ (Tata Nexon) పెట్రోల్, డీజిల్ వేరియంట్లను మార్కెట్లో ఆవిస్కరించింది. టాప్ అప్ ఫియర్ లెస్ ప్లస్ పీఎస్ ట్రిమ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కారు ధర రూ.13.6 లక్షలు (ఎక్స్ షోరూమ్), పెట్రోల్ డీసీటీ వేరియంట్ రూ.14.8 లక్షలు (ఎక్స్ షోరూమ్), డీజిల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ రూ.15 లక్షలు, డీజిల్ ఏఎంటీ వేరియంట్ రూ.15.6 లక్షలకు లభ్యం అవుతుంది.
1.2 లీటర్ల టర్బో పెట్రోల్ 3 సిలిండర్ ఇంజిన్ 120 హెచ్‌పీ విద్యుత్, 170 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల టర్బో డీజిల్ 4-సిలిండర్ ఇంజిన్ 115 హెచ్‌పీ, 260 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లతో వస్తున్నది. పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంటుంది.
టాటా నెక్సాన్ కారు 10.25 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎయిర్ ఫ్యూరిఫయర్, 8-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ చార్జర్, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లతో వస్తోంది. సేఫ్టీ కోసం ప్రామాణికంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్సీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ ప్యాసింజర్స్, ఐసోఫిక్స్, టీపీఎంఎస్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఉంటాయి.
సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కార్లలో పనోరమిక్ సన్ రూఫ్ ఉన్న కార్లు టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మాత్రమే. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు టాప్ హై ఎండ్ వేరియంట్లు ఏఎక్స్7, ఎఎక్స్ 7 ఎల్ ట్రిమ్స్ లో లభ్యం అవుతుంది.