Tata Curvv EV | అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా మోటార్స్ ఎస్యూవీ కూపే తరహా టాటా కర్వ్, టాటా కర్వ్.ఈవీ వాహనాల ఆవిష్కరణ ముహూర్తం వచ్చేసింది. ఈ నెల ఏడో తేదీన ఈ రెండు కార్లను టాటా మోటార్స్.. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దేశీయంగా అందుబాటులో ఉన్న ఎస్యూవీ కార్లలో టాటా కర్వ్.. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని భావిస్తు్న్నారు. టాటా కర్వ్.ఈవీతోపాటు సంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ (ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ – ఐసీఈ) ఆప్షన్లతో కూడిన టాటా కర్వ్ కూడా వస్తుంది. ఈ రెండు కార్లతోపాటు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలకు ఉపయోగపడే చార్జి పాయింట్ అగ్రిగేటర్ ను కూడా టాటా మోటార్స్ ఆవిష్కరించనున్నది. దేశవ్యాప్తంగా 15 పై చిలుకు చార్జింగ్ ప్రొవైడర్లకు అవసరమైన లైవ్ అప్ డేట్స్ అందిస్తుంది.
దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్‌దే హవా. టాటా నెక్సాన్.ఈవీ, టాటా పంచ్.ఈవీ, టాటా టైగోర్.ఈవీ, టాటా టియాగో.ఈవీ వంటి పాపులర్ మోడల్ కార్లతో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. తాజాగా టాటా కర్వ్.ఈవీ కారు ఆవిష్కరణతో టాటా ఈవీ కార్ల మార్కెట్ మరింత విస్తరించనున్నది. వచ్చే ఏడాదిలో టాటా హారియర్.ఈవీ కారును ఆవిష్కరించనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
టాటా మోటార్స్ కనెక్టెడ్ కార్ యాప్‌తో నేషనల్ వైడ్ చార్జి పాయింట్ అగ్రిగేటర్ ఫీచర్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. 15 పై చిలుకు చార్జ్ పాయింట్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో టాటా చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ అనుసంధానమై ఉంటుంది. ఆయా ఈవీ వాహనాలకు రియల్ టైం చార్జర్ స్టేటస్, సీమ్ లెస్ నేవిగేషన్ టూ చార్జర్ లొకేసన్స్, తదితర అంశాలు ఈ యాప్ లో ఉంటాయి.