ముంబై, ఫిబ్రవరి 20 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ఈవీ పరిధిని మరింత విస్తరించడానికి మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ ఈవీల మార్కెట్లోకి ప్రవేశించడానికి నయా పంచ్ మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.69 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. అలాగే బాష్ ఆప్షన్లో కూడా కొనుగోలు చేయవచ్చును.
ఈ ఆప్షన్ కింద కారు ధర రూ.6.49 లక్షలు కాగా, బ్యాటరీ ఈఎంఐ ఆప్షన్ కింద కిలోమీటర్‌కు రూ.2.6గా నిర్ణయించినట్టు టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. ఈ కారుకు ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభిం చినట్టు ఆయన చెప్పారు.