ఈవీలపై టాటా భారీ ఆఫర్లు
దేశవ్యాప్తంగా ఈవీ కొనుగోలుదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టాటా మోటర్స్ ప్రత్యేకంగా రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద ఈవీలపై రూ.3.30 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చునని తెలిపింది.
- రూ.3.30 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : దేశవ్యాప్తంగా ఈవీ కొనుగోలుదారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టాటా మోటర్స్ ప్రత్యేకంగా రాయితీలను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద ఈవీలపై రూ.3.30 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చునని తెలిపింది. టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్య్, హారియర్ ఎస్యూవీతోపాటు టియాగో హ్యాచ్బ్యాక్ను తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. వీటిలో కర్వ్య్ ఈవీపై రూ.3.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. ఎక్సేంజ్ బోనస్తోపాటు ఇతర డిస్కౌంట్లు కలుపుకొని మొత్తంగా రూ.3 లక్షలకు పైగా ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ కారు రూ.17.49 లక్షల నుంచి రూ.22.24 లక్షల లోపు దిగిరానున్నది. దీంతోపాటు పంచ్పై రూ.1.40 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నది. వీటిలో రూ.1.10 లక్షల బోనస్తోపాటు రూ.30 వేల వరకు ఎక్సేంజ్ బోనస్ పొందవచ్చునని తెలిపింది.
ప్రస్తుతం ఈ కారు రూ.9.99 లక్షలు మొదలుకొని రూ.14.44 లక్షల లోపు లభించనున్నది. అలాగే హారియర్ ఈవీపై రూ.1.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. వీటిలో లక్ష రూపాయలు బోనస్ కింద, మరో రూ.50 వేలు ఎక్సేంజ్ బోనస్ కింద లభించనున్నాయి. ప్రస్తుతం హారియర్ రూ.21.49 లక్షల నుంచి రూ.30.23 లక్షల లోపు ధరకు విక్రయిస్తున్నది. టియాగో ఈవీపై రూ.1.2 లక్షల వరకు ఆదాకానున్నది. దీంట్లో లక్ష రూపాయలు బోనస్ కింద, మరో రూ.20 వేలు ఎక్సేంజ్ కింద అందిస్తున్నది. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షలకు దిగిరానున్నది. నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

