టాటా నుంచి ఈవీ పికప్ వాహనం.. సింగిల్ చార్జింగ్‌తో 211 కిలోమీటర్లు..ధర రూ.11.95 లక్షలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసారి కొత్తగా ఈవీ పికప్ వాహనాన్ని పరిచయం చేసింది. 28.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ వాహనం సింగిల్ చార్జింగ్‌తో 211 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసారి కొత్తగా ఈవీ పికప్ వాహనాన్ని పరిచయం చేసింది. 28.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ వాహనం సింగిల్ చార్జింగ్‌తో 211 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ వాహనం ప్రారంభ ధర రూ.11.95 లక్షలుగా నిర్ణయించింది.
కంపెనీ నుంచి విడుదలైన మూడో చిన్న కమర్షియల్ వాహనం ఇదే కావడం విశేషం. కేవలం 55 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్న ఈ వాహనం 1,750 కిలోల సరుకును రవాణా చేయనున్నది. ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, కోల్డ్-చెయిన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్, పాల ఉత్పత్తుల సరఫరాతోపాటు ఇతర సరుకు రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని విడుదల చేసినట్టు టాటా మోటర్స్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

