న్యూఢిల్లీ, మార్చి 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్… ఈవీలపై ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లను ఈ నెల చివరి వరకు పొడిగించింది. సంస్థ వద్ద ఉన్న నిల్వలను క్లియర్ చేసుకునే ఉద్దేశంలో భాగంగా పలు ఈవీలపై నగదు రాయితీ, ఎక్సేంజ్ బోనస్‌లను ప్రకటించింది. సంస్థ ప్రకటించిన ప్రత్యేక స్కీం నెక్సాన్, టియాగో, టిగోర్లకు మాత్రమే వర్తించనున్నదని, కానీ పంచ్ ఈవీకి వర్తించదని స్పష్టంచేసింది. మూడు నెలల క్రితం ఈ మాడల్‌ను సంస్థ మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.