Citroen Basalt | ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన కూపే స్టైల్ ఎస్యూవీ కారు సిట్రోన్ బాసాల్ట్ (Citroen Basalt) కారును త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. వచ్చేనెల ఏడో తేదీన టాటా మోటార్స్ ఆవిష్కరించే టాటా కర్వ్ (Tata Curvv)కు పోటీగా సిట్రోన్ బాసాల్ట్ (Citroen Basalt) వస్తోంది. ఆగస్టు రెండో తేదీన సిట్రోన్ బాసాల్ట్ మార్కెట్లోకి రానున్నది. టాటా కర్వ్ (Tata Curvv)తోపాటు హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది సిట్రోన్ బాసాల్ట్ (Citroen Basalt).
భారత్ మార్కెట్లో సిట్రోన్ (Citroen) ఆవిష్కరిస్తున్న కార్లలో సిట్రోన్ బాసాల్ట్ (Citroen Basalt) ఐదోవది. ఇంతకు ముందు సీ3 హ్యాచ్ బ్యాక్ (C3 Hatchback), ఈసీ3 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్( eC3 Electric Hatchback), సీ3 ఎయిర్ క్రాస్ ఎస్యూవీ (C3 Aircross SUV), సీ5 ఎయిర్ క్రాస్ ఎస్యూవీ (C5 Aircross SUV) కార్లు ఆవిష్కరించింది. తమిళనాడులోని తిరువల్లూర్ యూనిట్లో సిట్రోన్ కార్ల తయారీ జరుగుతోంది. సిట్రోన్ బాసాల్ట్ (Citron Basalt) కారు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అప్ గ్రేడెడ్ టెయిల్ ల్యాంప్స్, న్యూ అల్లాయ్ వీల్ డిజైన్స్, ఇంటీరియర్గా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు ఉంటాయి.
సీ3 ఎయిర్ క్రాస్ మోడల్ కారులో వాడుతున్న సిట్రోన్ బాసాల్ట్ కారు 1.2 లీటర్ల జెన్-3 టర్బో ప్యూర్ టెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 110 పీఎస్ విద్యుత్, 190 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో ఉంటుంది. సిట్రోన్ బాసాల్ట్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుందని భావిస్తున్నారు.