హైదరాబాద్, మే 31: హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆర్బిక్యూలర్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ సంస్థలో టాటా క్యాపిటల్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టింది. టాటా క్యాపిటల్ హెల్త్‌కేర్ ఫండ్-2లో భాగంగా 20 మిలియన్ డాలర్లు (రూ.166 కోట్లకు పైమాటే) నిధులు సమకూర్చింది. ఎంతమేర వాటా దక్కించుకున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అర్బిక్యూలర్ వర్గాలు వెల్లడించాయి.