అపాచీకి మరో హైదరాబాద్ బాడీ
హైదరాబాద్‌లోని తమ ఉత్పాదక కేంద్రం నుంచి ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ కోసం మరో ఫ్యూజ్‌లేజ్‌ను పంపినట్టు టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తెలిపింది. ఇది ఇక్కడి నుంచి డెలివరీ అయిన 250వ హెలికాప్టర్ బాడీ కావడం గమనార్హం. టీబీఏఎల్ తయారు చేస్తున్న ఫ్యూజ్లేజ్లకు అమెరికా సైన్యంసహా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్నారు.
- ఇక్కడి ప్లాంట్ నుంచి ఏహెచ్-64
- హెలికాప్టర్ల తయారీకి 250వ ఫ్యూజ్‌లేజ్ డెలివరీ
హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్‌లోని తమ ఉత్పాదక కేంద్రం నుంచి ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ కోసం మరో ఫ్యూజ్‌లేజ్‌ను పంపినట్టు టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తెలిపింది. ఇది ఇక్కడి నుంచి డెలివరీ అయిన 250వ హెలికాప్టర్ బాడీ కావడం గమనార్హం. టీబీఏఎల్ తయారు చేస్తున్న ఫ్యూజ్లేజ్లకు అమెరికా సైన్యంసహా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లున్నారు.
భారత సైన్యం పొందుతున్న అపాచీ హెలికాప్టర్లకూ వీటినే వాడుతున్నారు. కాగా, ఈ ఫ్యూజ్‌లేజ్‌లు అమెరికాలోని అరిజోనాలోగల బోయింగ్ మెసా ప్లాంట్‌కు సరఫరా అవుతున్నాయి. ఇక్కడే బోయింగ్ తయారుచేసే ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలికాప్టర్లు తుది రూపును సంతరించుకుంటాయి. ఇంజిన్సహా అన్ని భాగాలను హైదరాబాద్ ప్లాంట్‌లో టీబీఏఎల్ తయారు చేసిన ఫ్యూజ్‌లేజ్‌లో అమర్చుతారు.
బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కలిసి ఏర్పాటుచేసిన జాయింట్ వెంచరే ఈ టీబీఏఎల్. ఆదిభట్లలో 14వేల చదరపు అడుగుల్లో టీబీఏఎల్ ప్లాంట్ ఉండగా, ఇక్కడ 900లకుపైగా ఇంజినీర్లు, టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అధునాతన కటింగ్-ఎడ్జ్ రోబోటిక్స్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ సాంకేతికతలను తయారీలో వినియోగిస్తున్నారు. అందుకే అపాచీ ఫ్యూజ్‌లేజ్ సరఫరాలో ఈ ప్లాంట్ కీలకంగా మారింది.
నిజానికి అపాచీ ఏరోస్ట్రక్చర్ అసెంబ్లీల్లో వినియోగించే 90 శాతానికిపైగా విడిభాగాలు భారత్‌లో తయారైనవే అవడం విశేషం. దేశంలోని 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన, ఏమాత్రం గురి తప్పకుండా దాడులు చేసే హెలికాప్టర్లలో ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ కూడా ఒకటి. అందుకే అగ్ర దేశాల నుంచి చిన్న దేశాల వరకు తమ రక్షణ వ్యవస్థలో వీటికి ప్రధాన స్థానాన్ని ఇస్తున్నాయి. ఇందులోని రకరకాల తుపాకులు, క్షిపణులు ఆకాశ, భూ లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలవు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

