TATA and ITC Super Apps : త్వరలో టాటా, ఐటీసీ సూపర్ యాప్స్..!
TATA and ITC Super Apps : ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్‌ను టాటా గ్రూప్ రూపొందిస్తున్నట్లు రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. గత వారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐటీసీ, రైతుల కోసం ఇలాంటి సూపర్ యాప్‌ను...

(TATA and ITC Super Apps) మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్ని యాప్‌లు ఉన్నాయి? మహా అయితే, 10, 15 వరకు ఉంటాయి. మనకు అవసరమైన యాప్‌లనే ఫోన్లో పెట్టుకుంటాం. అయితే, ఫోన్ స్లో అయిన సందర్భాల్లో, లేదంటే మరో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఫోన్స్‌లో స్పేస్ కోసం పాతవి డిలీట్ చేయాల్సి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఒకే యాప్‌తో పలు రకాల పనులు చేసే యాప్ అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే వినియోగదారుల సౌకర్యార్థం ప్రపంచంలోని వివిధ దేశాలలో సూపర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశంలో కూడా సూపర్ యాప్‌లను తీసుకొచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు సూపర్ యాప్స్ తీసుకొచ్చాయి. ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్‌ను టాటా గ్రూప్ రూపొందిస్తున్నట్లు రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. గత వారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐటీసీ, రైతుల కోసం ఇలాంటి సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.
బ్లాక్‌బెర్రీ సంస్థ వ్యవస్థాపకుడు మైక్ లాజారిడిస్ 2010 లో సూపర్ యాప్ అనే పదాన్ని రూపొందించారు. అయితే, చాలా రోజుల పాటు అమెరికా, యూరప్, యూకే నుంచి సూపర్ యాప్‌లు ఏవీ అందుబాటులోకి రాలేదు. సూపర్ యాప్ అంటే అవసరమైన అన్ని వస్తువులు, సేవలు ఒకే వేదికపై నుంచి అందుబాటులో రావడం.
జియో, పేటీఎం, ఫోన్‌పే, ఎస్బీఐ యోనో వంటి అనేక యాప్‌లు భారతదేశంలో సూపర్ యాప్‌లుగా ఉన్నాయి. ఇవి ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లను, ఉత్పత్తులను అందిస్తున్నాయి. జియో తన ప్లాట్ఫామ్లో 100 కి పైగా ఉత్పత్తులు, సేవలను అందించాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక పేటీఎం సంస్థ టికెట్ బుకింగ్, గేమ్స్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ వంటి సేవలు తీసుకొచ్చింది. అలాగే ఫోన్‌పే సంస్థ తమ సూపర్ యాప్‌లో ఓలా క్యాబ్స్, స్విగ్గీ, గ్రోఫర్స్, అజియో, డెకథ్లాన్, ఢిల్లీ మెట్రో వంటి సేవలు ఉన్నాయి. ఈ గ్రూపులో చేరేందుకు టాటా, ఐటీసీలు ఎదురుచూస్తున్నాయి.
టాటా గ్రూప్
టాటా గ్రూప్ తన సూపర్ యాప్‌లో తమ ఉత్పత్తులు, సేవలను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. దీని పైలట్ ప్రాజెక్ట్ కూడా వచ్చే నెలలో ప్రారంభం కానున్నది. దీని కోసం టాటా డిజిటల్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు.
ఐటీసీ
దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీలలో ఒకటైన ఐటీసీ తన సూపర్ యాప్ ఐటీసీ మార్స్‌ను ప్రారంభించనున్నట్లు వారం క్రితం తెలిపింది. MAARS అంటే మెటా మార్కెట్ ఫర్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సర్వీసెస్. ఇది ప్రపంచ స్థాయి బ్రాండ్లతో పాటు రైతులకు ఆదాయాన్ని పెంచుతుందని ఐటీసీ చెప్తున్నది.
ఇవి కూడా చదవండి..
జిల్లా వచ్చె.. గడ్డం పాయె ఢాం ఢాం ఢాం..
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

