హైదరాబాద్, సెప్టెంబర్ 17 : టాటా గ్రూపునకు చెందిన తనైరా విస్తరణ బాట పట్టింది. ప్రతియేటా 15 నుంచి 20 కొత్తగా స్టోర్లను తెరవబోతున్నట్టు కంపెనీ సీఈవో అంబుజ్ నారాయణ్ తెలిపారు. వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందన్న ఆయన..
ప్రస్తుత పండుగ సీజన్లో 30 శాతం వృద్ధిని సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా సంస్థకు 80 స్టోర్లు ఉండగా, అలాగే హైదరాబాద్లో ఏడు ఉన్నాయన్నారు.