ISB-Talent Sprint | ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో ఎన్ఎస్ఈ గ్రూప్ ఎడ్టెక్ కంపెనీ టాలెంట్ స్ప్రింట్ మల్టీ ఇయర్ పార్టనర్షిప్ ఒప్పందం కుదుర్చుకున్నది. తన విస్తరణ ప్రణాళికలతోపాటు ఇన్నోవేటివ్ కార్యక్రమాల ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్లను రూపొందించాలన్న ఐఎస్బీ నిబద్ధతతో ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ స్ట్రాటర్జిక్ ఔట్రీచ్ పార్టనర్‌గా టాలెంట్ స్ప్రింట్ వ్యవహరించనున్నది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఫ్యూచర్ రెడీ సీఎఫ్‌వో ప్రోగ్రామ్ ప్రారంభించనున్నాయి. డిజిటల్ ఫస్ట్ వరల్డ్‌కు సారధ్యం వహించేందుకు నూతన తరం ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కోసం పెరుగుతున్న అవకాశాలను భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్యూచర్-రెడీ సీఎఫ్‌వో ప్రోగ్రామ్ పని చేస్తుంది.
ఫ్యూచర్ రిలవెంట్ డిజిటల్టెక్నాలజీస్, ఫైనాన్సియల్ స్ట్రాటర్జీస్తో ప్రస్తుత, నూతన, సీఎఫ్‌వోలు కావాలని కలలు కంటున్న వారు సాధికారత సాధించడానికి ఫ్యూచర్ రెడీ సీఎఫ్‌వో ప్రోగ్రామ్ పని చేస్తుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యం గల ఫ్యూచర్‌రెడీ ఫైనాన్స్ లీడర్లను అభివృద్ధి చేస్తుంది.
టాలెంట్ స్ప్రింట్ ఎండీ కం సీఈవో డాక్టర్ శాంతను పాల్ మాట్లాడుతూ మోడ్రన్ ఫైనాన్స్, డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్‌ను కలగలిపే ఈ ప్రోగ్రామ్.. ఫైనాన్సియల్ ప్రొఫెషనల్స్‌ను వారి కెరీర్లో నూతన అధ్యాయంలోకి తీసుకెళుతుందన్నారు. ఆరు నెలల పాటు ఈ ఫ్యూచర్ రెడీ సీఎఫ్‌వో కార్యక్రమం సాగుతుంది.
ప్రొఫెసర్ భగవాన్ చౌదరి సారధ్యంలోని ఐఎస్బీ ఫ్యాకల్టీ సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఫ్రెండ్లీ, హైబ్రీడ్/ ఆన్లైన్ తరగతుల బోధన జరుగుతుంది. 2022 జనవరి నుంచి హైదరాబాద్ ఐఎస్బీ క్యాంపస్‌లోనే ప్రారంభం అవుతుంది. తొలి బ్యాచ్ శిక్షణ కోసం అర్హులైన వారు, ఆసక్తి గల వారు.. https://isb.talentsprint.com/cfo/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఐఎస్బీ సూచించింది.