హైదరాబాద్, నవంబర్ 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.రూ.32 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది తాజ్ జీవీకే హోటల్స్. క్రితం ఏడాది ఇది రూ.3.70 కోట్లుగా ఉన్నది. ఏడాది క్రితం రెండో త్రైమాసికంలో రూ.56 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను రెండు రెట్లు పెరిగి రూ.114 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.