అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సేల్స్‌ఫోర్స్ అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ట్యాబ్లూ సంస్థ వచ్చే ఐదేండ్లలో కోటి మంది డేటా లెర్నర్స్‌కు శిక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఏ అంశంపైనా విధాన నిర్ణయం తీసుకోవాలన్నా.. విశ్లేషణ జరుపాలన్నా.. సిబ్బంది నియామకానికి డేటా కీలకం. పలు సంస్థలు డేటా కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ది గ్రేట్ డేటా లిటరసీ గ్యాప్.. డిమాండ్ ఫర్ డేటా స్కిల్స్ ఎక్స్సీడ్స్ సప్లయ్ అనే పేరుతో సర్వే నిర్వహించింది.
83 శాతం మంది సీఈవోలు తమ సంస్థలకు డేటా కావాలన్నారు. 33 శాతం మంది సిబ్బంది మాత్రమే డేటా అనలిటిక్స్ ఆధారంగా సౌకర్యవంతంగా విధులు నిర్వర్తించారని, చాలా మంది ఉద్యోగులు సరైన డేటా లేకుండా పని చేస్తున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు శరవేగంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాపార లావాదేవీలు జరుపడానికి డేటాను వినియోగించాల్సిందే.
ఆయా సంస్థల డేటా పొందడం ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంపైనే డేటాతో సంబంధం ఉన్న బిజినెస్‌ల సక్సెస్ ఆధారపడి ఉందంటున్నారు ట్యాబ్ల్యూ ప్రెసిడెంట్ అండ్ సీఈవో మార్క్ నెల్సన్ తెలిపారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న డేటా లిటరసీ గ్యాప్‌ను తొలగించేందుకు డేటా ఆధారిత బిజినెస్‌ను అభివృద్ధి చేసేందుకే డేటా ఆధారిత బిజినెస్‌ను అభివృద్ధి చేసేందుకే డేటా లెర్నర్స్‌కు శిక్షణ ఇవ్వాలని ట్యాబ్ల్యూ నిర్ణయించింది.