హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసిన టీ హబ్.. తాజాగా మారుతి సుజుకీకి చెందిన ఇన్నోవేషన్ ల్యాబ్‌ను టీ హబ్ ప్రతినిధులు సందర్శించారు.
ఈ సందర్బంగా టీ హబ్ సీఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ..మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మారుతితో కలిసి పనిచేస్తున్నామని, గత రెండేళ్లుగా 20 స్టార్టప్‌లను గుర్తించి వాటికి పూర్తి స్థాయిలో సహకారం అందించామని, అదేవిధంగా ఈ ఏడాది సైతం మొబిలిటికి సంబంధించిన 10-12 స్టార్టప్‌లను గుర్తించి, ప్రోత్సహించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ కార్పొరేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ సరికొత్త ఆవిష్కరణలు జరిగేలా టీ హబ్ పనిచేస్తుందని ఆయన వివరించారు.