కొండాపూర్, నవంబర్ 25 : యువతలో స్కిల్, సృజనాత్మకతను పెంపొదించడంతోపాటు దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికోసం అండగా నిలిచేందుకుగాను టీ హబ్ ప్రత్యేకంగా 3టీ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నది. ఈ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన బ్రోచర్లను ఆవిష్కరించారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఉపాధి, ఆర్థికాభివృద్ధిలో అండగా నిలుస్తున్న 3టీ ప్రోగ్రాంను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా 10వేల మంది యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా కొనసాగుతుందని ఈవోల్ స్కిల్ సీఈవో సౌమ్యరావు అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.