T Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్ ఈనెల 30న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ఆలోచన దశ నుంచి వ్యాపార పరంగా అది కార్యరూపం దాల్చేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో నిపుణులతో నెట్ వర్క్ మీటింగ్ ఉంటుందని, అలాగే ఆసక్తి ఉన్న వారు ఈ లింకు (https://bit.ly/thub-idea openhouse)లో నమోదు చేసుకోవాలని టీ హబ్ వర్గాలు సూచించారు.