హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): కొత్తగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేథస్సు పరిజ్ఞానంపై విసృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి ఈ నెల 6న వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు టీ హబ్ ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా విసృతంగా వాడుకలోకి వచ్చిన ఏఐ టూల్స్ తరహాలో పరిశ్రమల అవసరాల కోసం ఉత్పాదక (జనరేటివ్)ఏఐపై ఆవిష్కర్తలు, స్టార్ట ప్ నిర్వాహకులు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా అమెజాన్ వెబ్ సర్వీసు (ఎడబ్ల్యుఎస్) సహకారంతో ఈ వర్క్‌షాపును నిర్వహిస్తున్నామని, ఔత్సాహికులు టీ హబ్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.