Padma Awards | భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వాటిలో ఎనిమిది మంది పారిశ్రామిక వేత్తలు, బ్యాంకింగ్ నిపుణులకు పద్మ పురస్కారాలు అందిస్తామని తెలిపింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి వ్యవస్థాపకులు ఒసాము సుజుకి (మరణానంతరం)కి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.
తమిళనాడుకు చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్త- దాత నల్లి కుప్పుస్వామి శెట్టి, గుజరాత్‌కు చెందిన పంకజ్ పటేల్‌లకు పద్మ భూషణ్ పురస్కారాలు ప్రకటించింది. ఇక ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, పంజాబ్‌కు చెందిన ఓంకార్ సింగ్ పాహ్వా, పవన్ గోయెంకా, ఆర్జీ చంద్రమోగన్, సల్లి హోల్కర్లకు పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది.