Maruti Suzuki | దేశీయంగా కార్ల విక్రయాల్లో గత నెలలో మారుతి బెస్ట్’గా నిలిచింది. 1.81 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే మూడు శాతం గ్రోత్ నమోదైంది. ఎస్‌యూవీలు, ఇతర యుటిలిటీ వెహికల్స్ సేల్స్‌తో బెస్ట్ కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి చోటు దక్కించుకున్నది. బ్రెజా, గ్రాండ్ విటారా వంటి ఎస్యూవీ కార్ల విక్రయాలు మొత్తం మారుతి సేల్స్‌లో 80 శాతం పై చిలుకు. గ్రాండ్ విటారా, బ్రెజాతోపాటు జిమ్నీ, ఫ్రాంక్స్ కార్లతో భారత్ ఎస్యూవీ కార్ల సేల్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది.
సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి 1,81,343 కార్లు విక్రయించింది. గతేడాది 1.50 లక్షల కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే రెండు శాతం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్-సెగ్మెంట్ మధ్య మారుతి సుజుకి కార్ల విక్రయాలు పది లక్షల మైలురాయిని దాటాయి.
ఎస్ యూవీలతోపాటు యుటిలిటీ వెహికల్స్ – ఎర్టిగా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో మోడల్ కార్ల సేల్స్.. మొత్తం మారుతి సుజుకి కార్ల సేల్స్‌లో 82 శాతం. మహీంద్రా అండ్ మహీంద్రా కంటే ఎక్కువగా మారుతి సుజుకి 59,271 యుటిలిటీ వెహికల్స్ విక్రయించింది. బ్రెజా, గ్రాండ్ విటారా కార్లు.. ఎస్ యూవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కార్లుగా నిలిచాయి. ఫ్రాంక్స్, జిమ్నీ సైతం పాపులారిటీ పెంచుకుంటున్నాయి. ఇక గతేడాది సెప్టెంబర్ 26న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన గ్రాండ్ విటారా.. ఏడాదిలోపు లక్ష యూనిట్లు విక్రయించిన మోడల్ గా రికార్డు నమోదు చేసింది. 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ నెలాఖరు వరకూ 1.20 లక్షల గ్రాండ్ విటారా కార్లను విక్రయించింది మారుతి.
ఎంట్రీ లెవల్ కార్లు.. ఆల్టో, ఎస్-ప్రెస్సో కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. గతేడాదితో పోలిస్తే 65 శాతం తగ్గి 10,351 యూనిట్లకు పరిమితం అయ్యాయి. గతేడాది కంపాక్ట్ మోడల్ కార్లు 72,176 యూనిట్లు అమ్ముడైతే, ఈ ఏడాది 68,552 యూనిట్లకు పరిమితం అయ్యాయి.