హైదరాబాద్, జూన్ 13: సువెన్ ఫార్మాస్యూటికల్స్.. సపలా ఆర్గానిక్స్లో 67.5 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. ఒప్పందం విలువ రూ. 229 కోట్లు. ఈ సందర్భంగా సపలా ఫౌండర్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. వ్యూ హాత్మక వ్యాపార భాగస్వామి సువెన్తో కలిసి మరింతగా విస్తరించనున్నట్లు, భవిష్యత్తు వృద్ధికి ఈ వాటా విక్రయం తోడ్పాటునందించనున్నదన్నారు.