చెన్నై, నవంబర్ 18: సుందరం ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ డీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ..
దక్షిణాది వ్యాపార విస్తరణలోభాగంగా త్వరలో తెలంగాణలో అడుగపెట్టబోతున్నట్టు, వచ్చే 12 నెలల్లో 10 నూతన శాఖలను ప్రారంభించడంతోపాటు రూ.120-150 కోట్ల వరకు గృహ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే సంస్థ తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో సేవలు అందిస్తున్నది.